బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులకు మహర్దశ పట్టుకుంది
చంద్రుడు ఆదివారం రోజు మేషరాశిలోకి సంచారించాడు. అప్పటికే ఆ రాశిలో బుధుడితోపాటు సూర్యుడు కూడా ఉన్నాడు. అన్ని గ్రహాలు ఒకే రాశిలో కలిశాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి ధనలాభం ఉంది. అలాగే మేషరాశివారితోపాటు మకర రాశివారి జీవితం ఆనందదాయకంగా మారుతుంది. బుధాదిత్య రాజయోగంతో లాభపడే రాశుల వివరాలు తెలుసుకుందాం.
మిధున రాశి
మానసికంగా ఆనందం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. భాగస్వామి మధ్య పరస్పరమైన చర్చలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటారు.

కన్యా రాశి
ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మానసిక సమస్యలతో బాధపడేవారికి గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తారు. వ్యాపారస్తులు ఈ సమయంలో ఎంతో బిజీగా ఉంటారు. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో వాటాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వైవాహిక జీవితంలో శృంగార జీవితాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి
పూర్తి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబ సమేతంగా కలిసి తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి లాభాలున్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఒంటరి జీవితం గడుపుతున్నవారికి శుభం జరుగుతుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి.












Click it and Unblock the Notifications