నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
దేవతల గురువైన బృహస్పతి శ్రీరామ నవమిరోజు భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అంతా శుభమే జరగనుంది. అదృష్టం తోడుంటుందని, పట్టిందల్లా బంగారంలా మారుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. లాభపడే రాశుల వివరాలను, వారికి అందే ప్రయోజనాలేంటి అనే విషయాలను తెలుసుకుందాం.
మేష రాశి
వీరికి ఆర్థికంగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో లేదంటే సన్నిహితులతో కలిసి ఆధ్యాత్మికపరమైన యాత్రకు వెళతారు. డబ్బులు నాలుగు విధాలుగా సంపాదిస్తారు. చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఉద్యోగస్తులకు వారి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.

సింహ రాశి
ఆర్థికంగా లాభాలు వస్తాయి. వృత్తి, వ్యాపార రంగంతోపాటు వ్యవసాయంలో ఉన్నవారు కూడా లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం కలిసివచ్చి డబ్బు సంపాదన పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులకు శుభవార్త ఉంది.
తులా రాశి
అన్నింటా వీరికి బాగుంటుంది. ఆర్థికంగా లాభాలున్నాయి. సంపాదన పెరగడంతోపాటు ఆదాయం కూడా పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు వెళతారు. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం లాభిస్తుంది. కొత్తగా భూములను కొనుగోలు చేయాలనుకున్నవారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి.
వృశ్చిక రాశి
వీరికి ఎంతో బాగుంటుంది. గతం నుంచి రాని మొండి బాకీలు వసూలవుతాయి. కెరీర్ లో మంచి పురోగతి ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో లాభాలు కలుగుతాయి. పిల్లల వల్ల శుభవార్త వింటారు. ధనలాభం కలగడంవల్ల సంతోషం కలుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, అరమెరికలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తారు.












Click it and Unblock the Notifications