సెప్టెంబరు 8వ తేదీ వరకు ఈ రాశులకు భారీగా సంపద
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. అలాగే రెండు గ్రహాలు ఎదురుపడితే వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి. ఇలా సంచారం చేసే సమయంలోనే శుభ ప్రయోజనాలు కూడా కలుగుతాయి. జ్యోతిష్యం ప్రకారం ఎటువంటి సొంత గ్రహం లేని కేతువు హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. దాదాపు అరవైమూడు రోజులపాటు ఇక్కడే ఉండి ఇదే నక్షత్రం మొదటి దశలోకి వస్తాడు. అంటే ప్రస్తుతం హస్తా నక్షత్రం రెండోదశలో ఉన్నాడు. దీనివల్ల సెప్టెంబరు ఎనిమిదో తేదీ వరకు మూడు రాశులవారికి సంపద పెరగబోతోంది.
మేష రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం అద్భుతంగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. ధైర్యం పెరిగి శక్తి సామర్థ్యాలతో ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు. ఈ పరిణామాలన్నీ ఆర్థికంగా లాభాన్ని కలగజేస్తాయి. మనసులోని కోరిక నెరవేరిందంటే అందుకు కారణం కేతువు. ఉద్యోగాలు చేస్తున్నవారికి పదోన్నతి దక్కుతుంది. కుటుంబ సభ్యులంతా విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు.

వృషభ రాశి
డబ్బును పొదుపు చేయడంలో విజయవంతమవుతారు. ప్రజలంతా ఈ సమయంలో మీవైపు మొగ్గుచూపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో విజయాన్ని అందుకుంటారు. ఇదే సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగాన్ని సాధిస్తారు. కొత్త స్థలాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
మకర రాశి
ఆర్థికంగా లాభం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనిని పూర్తిచేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications