రేపటి నుంచి ఈ రాశులవారికి అఖండ ధనయోగం
మీనరాశిని పరిపాలించే అంగారక గ్రహంలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఈ సంఘటన ఈనెల 10వ తేదీన జరగబోతోంది. అదే సమయానికి, అదే గ్రహంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇలా బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలవడంవల్ల శక్తివంతమైన ప్రత్యేక యోగం ఏర్పడుతోంది. ఈనెల 30వ తేదీ వరకు మీనరాశిలోనే సంచారం ఉంటుంది. దీనివల్ల ఏయే రాశులకు శుభ ఫలితాలు కలుగుతాయి, వారికి ఏ విధంగా కలిసి రానుంది అనే విషయాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారాలు చేసేవారికి పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని రీతిలో ధనలాభం ఉంది. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. కెరీర్ కు సంబంధించి జీవితంలో మార్పు చోటుచేసుకుంటుంది. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి.

మేషరాశి
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్య పరంగా ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అన్నివిధాలుగా కలిసివస్తుంది. ఈ రాశివారు అంతిమంగా అనేక లాభాలను పొందుతారు.
మకర రాశి
ఈ సమయంలో వీరు ఎటువంటి పనులు చేపట్టినా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడించడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. భగవంతుడికి రుణపడి ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయం తీసుకునేముందు ఆలోచనాత్మకంగా ఉండాలి. ఎంతో ఆలోచించికానీ నిర్ణయం తీసుకోవద్దు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. పెట్టుబడులు పెట్టే క్రమంలో కూడా పలురకాల జాగ్రత్తలు తీసుకోవాలి.












Click it and Unblock the Notifications