జూన్ 29న శని తిరోగమనం.. ఈ రాశులపై కుబేరుడి కుంభవృష్టి
జ్యోతిష్యం ప్రకారం శని శక్తివంతమైన గ్రహం. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అందరూ అయ్యో.. శని అంటారుకానీ.. శని దేవుడు జీవిత పాఠాన్ని నేర్పుతాడు. ఆయన ఇచ్చే అనుభవాలు భవిష్యత్తులో మన పనితీరును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు శని తిరోగమనం చేస్తుంటాడు. జూన్ 29న కుంభరాశిలో ఇలాగే తిరోగమనం చేస్తున్నాడు. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
కుంభ రాశి:
శని తిరోగమనం వల్ల ఈ రాశివారికి పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.

మేష రాశి
ఈ రాశివారి కెరీర్ కు సంబంధించి మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రమోషన్ వస్తుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో పురోగతి ఉంది. వ్యాపారాలు చేసేవారు గొప్ప విజయాన్ని సాధిస్తారు. దీంతోపాటు పోటీపరీక్షలు రాసేవారికి అనుకూలమైన సమయం ఇది. ఈ సమయంలో ఎలాంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. అన్ని రంగాల్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
మిథున రాశి
ఈరాశివారికి ఊహించని లాభాలున్నాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. డబ్బులు పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. దీంతోపాటు ఈ రాశివారు దినదినాభివృద్ధి చెందుతారు. సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులకు ఇది అనువైన సమయం. ప్రేమ జీవితంలో ఉన్నవారికి బాగుంటుంది.












Click it and Unblock the Notifications