ఈనెల 12 నుంచి ఈ రాశులకు ప్రతిరోజు పండగే
శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అతడిని న్యాయదేవతగా పిలుస్తారు. మనం చేసే కర్మలను బట్టి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. వ్యక్తి జాతకంలో శని శుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో డబ్బు, ఆనందం, గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని గత నెల ఆరోతేదీన నక్షత్ర సంచారం చేసింది.
ఆ తర్వాత ఈనెల 12వ తేదీన మరోసారి నక్షత్ర సంచారం చేయబోతోంది. ఈ ప్రభావం ఆగస్టు 18వ తేదీ వరకు ఉంటుంది.దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో శుభ ఘడియలు వస్తాయి. మరికొన్ని రాశులవారికి మాత్రం ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

మేషరాశి
శని నక్షత్ర సంచారం కారణంగా ఈ రాశి వారికి మే 12వ తేదీ నుంచి అపార ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా వీరికి గతంలో రాకుండా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. సంపాదన పెరుగుతుంది. అలాగే ఆస్తులు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
కన్యా రాశి
గతంలో మొదలై నిలిచిపోయి పనులన్నింటినీ ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్తలు అందుతాయి. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారికి వేతనం పెరగడంతోపాటు పదోన్నతి కూడా ఉంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కష్టపడినదాన్ని బట్టి ఫలం అందుతుంది.
కుంభ రాశి
ఈ రాశిని శనిదేవుడు పాలిస్తాడు. దీనివల్ల కుంభరాశివారికి విపరీతమైన ధనలాభం ఉంది. వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తరుచుగా పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అనుకూల పరిణామాలు ఎదురవుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం బాగుంటుంది.












Click it and Unblock the Notifications