ఈనెల 17వ తేదీలోపు ఈ రాశులు ధనవంతులవుతారు
ఆగస్టు నెల అంటేనే పవిత్రమైన శ్రావణ మాసం. కొన్ని గ్రహాలు రాశి సంచారంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నాయి. మరికొన్ని గ్రహాలు తిరోగమన దిశలో పయనిస్తాయి. కీలకమైన బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, లక్ష్మీనారాయణ యోగం కూడా ఈవారంలోనే ఏర్పడనున్నాయి. మొత్తం 12 రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని రాశులవారికి మాత్రం ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా వేధిస్తున్న సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. ఈవారంలో ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
వృషభరాశి
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఆరోగ్యం చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారన్ని విస్తరిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతితోపాటు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి తగినరీతిలో గౌరవం లభిస్తుంది.

కర్కాటక రాశి
ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యంతో బాధపడేవారు మంచి ఆరోగ్యవంతులు అవుతారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. స్నేహితుల నుంచి మద్దతు లభించి నిలిచిపోయిన పనులను పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని విషయంలో మంచి నైపుణ్యతను సాధిస్తారు.
మేషరాశి
వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఈ సమయంలో వ్యాపారులు పెట్టే పెట్టుబడుల నుంచి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేసి మంచి విజయాలను సాధిస్తారు.
కన్యారాశి
ప్రేమ జీవితంలో ఉన్నవారికి సంతోషంగా గడుస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగస్తులు పర్మినెంట్ అవుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి అదృష్టం సహకరించడంతో బాగా కలిసివస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సమయంలో సులువుగా పరిష్కరించుకుంటారు.












Click it and Unblock the Notifications