కర్కాటకంలో కుజుడి సంచారం.. ఈరాశులవారికి అన్నీ సమస్యలే
ఈరోజు కర్కాటక రాశిలో అంగారక సంచారం జరుగుతోంది. దీనివల్ల రాబోయే 53 రోజులపాటు కుజుడు ఈ రాశిలో ఉండి ఇక్కట్లకు గురిచేస్తాడు. శనితో షడాష్టక యోగం ఏర్పడటంతోపాటు 10వ ఇంట్లో రాహువు, బృహస్పతి, బుధుడు, సూర్యుడు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో కొన్ని రాశులవారికి సమస్యలు ఎదురుకాబోతున్నాయి. ఏయే రాశులనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది. తోబుట్టువులతో వివాదాలు పెద్దవవుతాయి. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. పనిచేసే కార్యాలయంలో ఎటువంటి కారణాలు లేకుండా వివాదాలు నెలకొంటాయి. ఖర్చులు నియంత్రించకపోతే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. వ్యర్థ వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

మిథునరాశి:
ఎదుటివారితో మాట్లాడే సమయంలో సరైన పదాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ సంభాషణ వివాదానికి దారితీస్తుంది. పనిచేసేచోట ఇది మీకు ప్రతికూలంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవయ్యే అవకాశం ఉంది. ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. వ్యాపారంలో కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. బాగా కారంగా ఉండే వంటకాలను త్యజించాలి.
కర్కాటక రాశి:
అనారోగ్యం కలుగుతుంది. వైద్యుడిని సంప్రదించకపోతే సమస్య తీవ్రమవుతుంది. కోపం విపరీతంగా పెరుగుతుంది. తొందరపాటుతో చేసే ప్రతి పని మీకు నష్టాలను తెచ్చిపెడుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతింటాయి.
వృశ్చికరాశి:
తండ్రితో గొడవలు జరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పనిచేసేచోట పెద్ద మార్పు ఉంటుంది లేదంటే బదిలీ అవుతారు. స్నేహితులతో, బంధువులతో బంధాలు విడిపోతాయి. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటారు.
ధనుస్సు రాశి:
జీవితంలో గందరగోళం తలెత్తుతుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత లేకపోతే కష్టం. వైవాహిక జీవితం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అనారోగ్యం కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం లాభం కలుగుతుంది. తండ్రి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. పూర్వీకుల ఆస్తిలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications