రేపటి నుంచి ఈ రాశులవారు మూడుపూటలా తింటే అదృష్టమే!
వ్యక్తి జాతకంలో బుధుడు శుభ స్థానంలో ఉంటే వారు తిరుగులేని విజయాలను సాధిస్తారు. అదే అశుభ స్థానంలో ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వృత్తితోపాటు ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రేపు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబరు నాలుగోతేదీ వరకు అక్కడే ఉండే బుధుడివల్ల ఏయే రాశులవారిపై ఎటువంటి ప్రభావం పడుతుంది.. ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం.
సింహరాశి
వీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నుంచి నోటీసులు అందుకుంటారు. ఖర్చులు ఊహించనిరీతిలో పెరుగుతాయి. న్యాయపరమైన సమస్యలు వస్తయి. ఆర్థికంగా పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.

ధనుస్సు రాశి
బుధుడి సంచారంవల్ల వీరు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భాగస్వామ్యంతో జీవితం గడుపుతున్నవారు కొన్ని చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంపత్య జీవితంలో కలహాలతో భార్యతో విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారస్తులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కుంభ రాశి
శత్రువులవల్ల హాని కలుగుతుంది. కొన్ని పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో రహస్యంగా ఉంటే మంచిది. లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు వరకు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలపాలవుతారు. డబ్బులు కూడా నిలిచిపోయే అవకాశం కనపడుతోంది. డబ్బును వేరేవారికి ఇచ్చే సమయంలో, నగదు బదిలీ చేసే సమయంలో అప్రమత్తత అవసరం.












Click it and Unblock the Notifications