జులై 13 వరకు ఈ రాశులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..!

జ్యోతిష్యంలో శని దేవుడికి, అంగారక గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. కుజుడు జూన్ 1న మేషరాశిలోకి ప్రవేశించాడు. జూలై 12 వరకు అక్కడే ఉంటాడు. కుజుడు మేషరాశిలోకి రావడంవల్ల శని మూడోచూపు అంగారకుడిపై పడింది. దీనివల్ల కొన్ని రాశులవారు ఎన్నో జాగ్రత్తలను పాటించాల్సి ఉంది. ఈ సమయంలో పలు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జులై 12వ తేదీ వరకు వీరంతా జాగ్రత్తగా ఉండాలి. ఏయే రాశులవారు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఈ రాశివారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాలి. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. సాధ్యమైనంతవరకు కోపం తగ్గించుకొని శాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఉద్యోగంలో కొంత అదనపు బాధ్యతను పొందుతారు. విద్యకు సంబంధించిన పనుల విషయంలో అప్రమత్తత అవసరం.

these zodiac signs will face somany problems due to saturn third aspect on jupiter

వృశ్చిక రాశి
అనేక ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. జీవిత భాగస్వామితో సమయం గడపాలి.. లేదంటే సమస్యలు ఎదురవుతాయి.

మకర రాశి
ఎదుటివారితో చర్చలకు దూరంగా ఉండాలి. లేదంటే విభేదాలు కలుగుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. చేసే ఖర్చు ఆలోచనాత్మకంగా ఉండాలి. మనసు కలత చెందుతున్నప్పటికీ ధైర్యంగా ఉండాలి. వాహన సౌకర్యం తగ్గుతుంది. విద్యా సంబంధిత పనులపై దృష్టి సారించాలి. కొత్త పనిని ప్రారంభించే ముందు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.

కుంభ రాశి
మనసు కలత చెందుతుంది. ఓపిక ఉండదు. మాట కరుకుగా లేకుండా చూసుకోవాలి. సహనంతో ఉండాలి. కోపం వస్తే సంయమనంతో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎక్కువగా శ్రమపడాల్సి ఉంటుంది.

మీన రాశి
ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనవసర విషయాల్లో తల దూర్చొద్దు. కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి యాత్రలకు వెళతారు. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు ఇబ్బంది పెడతాయి. కూడబెట్టిన సంపదలో తగ్గుదల ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+