ఈ రాశులు 10 రోజుల్లో ధనవంతులవుతారు... మాట తప్పనన్న శుక్రాచార్యులు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, అందానికి, ఐశ్వర్యానికి, విలాసాలకు కారకుడు. జాతకంలో ఆయన శుభస్థానంలో ఉంటే ఆ రాశులవారికి తిరుగుండదు. వీరికి జీవితంలో ధనం కలగడంతోపాటు సంతోషం వెల్లివిరుస్తుంది. కొంతకాలం క్రితమే పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టిన శుక్రుడు వచ్చేనెల ఒకటోతేదీన అదే నక్షత్రంలో సంచారం చేస్తాడు. దాదాపు పదిరోజులపాటు ఉండే ఈ సంచారం వల్ల నాలుగు రాశులవారికి అదృష్టం కలిసివస్తుంది. ఆర్థికంగా బలపడతారు.
వృశ్చికం
వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ధనలాభం బాగా ఉంది. కొంతకాలం నుంచి పెండింగ్ లో ఉంటూ, వాయిదాలు పడుతూ వస్తోన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఒకటోతేదీ వరకు ఈ రాశివారికి తిరుగులేదని చెప్పొచ్చు.

మకరం
ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి పనితీరుపై ప్రశంసలు లభించడంతోపాటు వేతనం పెరుగుతుంది. సహచర ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి. అధిక సమయాన్ని కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యతనిస్తారు.
కుంభం
ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ప్రయోజనాలు ఎక్కువగా ఉండటంవల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు సులువుగా చేస్తారు.
వృషభం
కుటుంబంలో వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి పనులన్నింటినీ పూర్తిచేస్తారు. ఆర్థికంగా మెరుగుపడతారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త అందుతుంది. ఇదే సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications