ఈ రాశులకు ఐశ్వర్యాన్ని కొద్ది కొద్దిగా పంచుతున్న రాహువు-కేతువు
జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయంటోంది. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి ఇవి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇవి మనుషుల వ్యక్తిగత జీవితాలను మలుపు తిప్పుతాయి. నవ గ్రహాల్లో ఒకటైన కేతువు వల్ల కొన్ని రాశులవారికి ధనలాభం కలగబోతోంది. కేతువు ఎప్పుడూ తిరోగమనదిశలో ఉంటాడు. కేతువు-రాహువు విడదీయరానివి. వేర్వేరు రాశుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఇవి ఇచ్చే ఫలితాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. 2023 అక్టోబరులో కేతువు కన్యారాశిలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి మళ్లీ మరో రాశికి మారడానికి 18 నెలల సమయం తీసుకుంటాడు. కేతువు ప్రభావంతో అదృష్టవంతులు కాబోతున్న రాశుల వివరాలు తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశి 11వ ఇంట్లో కేతువు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఈ రాశులవారికి డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు. కొత్తగా పెట్టే పెట్టుబడుల నుంచి వీరికి అదృష్టం కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదలను చూస్తారు. జ్ఞానం పెరిగడంద్వారా వీరికి ఆత్మవిశ్వాసం కలిగి అన్నిపనులు పూర్తిచేస్తారు. తీసుకునే నిర్ణయాలు జీవితంలో వీరికి మంచి అభివృద్ధికి బాటలు పరుస్తాయి.

కర్కాటక రాశి
ఈ రాశివారు పెద్ద విజయాలను పొందుతారు. కొత్తగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఆదాయాన్ని పెంచుకుంటారు. కలలను సాకారం చేసుకోవడానికి వీరు కష్టపడతారు. ఎక్కువ అవకాశాలు వీరి తలుపు తడతాయి. అదృష్టం తోడుండటంవల్ల పనులద్వారా ఆదాయం కలుగుతుంది. వీటినుంచి పూర్తి ప్రయోజనం దక్కుతుంది. ఈ రాశిచక్రానికి సంబంధించిన మూడో ఇంట్లో కేతువు సంచరిస్తున్నాడు. పెద్ద విజయాన్ని సాధించబోతున్నారు. దీనివల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి.












Click it and Unblock the Notifications