23న హనుమజ్జయంతి.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం
శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు హనుమంతుడి జయంతిని జరుపుకుంటాం. ఈనెల 23వ తేదీ మంగళవారం వచ్చింది. అన్ని గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు హనుమజ్జయంతి రోజు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేరోజు చైత్ర పౌర్ణమి కూడా కావడంతో కొన్ని రాశులవారికి ఎంతో మేలు కలగనుంది. ఆంజనేయులు ప్రత్యేక ఆశీర్వాదాలతోపాటు కుజుడి అనుగ్రహం కూడా లభించడంవల్ల వారి అదృష్టం రెట్టింపు కానుంది.
వృషభ రాశి
హనుమజ్జయంతి రోజే కుజుడు రాశి చక్రాన్ని మార్చుకుంటున్నాడు. వ్యాపారంతోపాటు వృత్తిలో ఉన్నవారికి పురోభివృద్ధి ఉంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడమే కాదు కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కష్టపడి పనిచేసి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభాలున్నాయి. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధిస్తారు.

తులా రాశి
ప్రతి రంగంలో విజయం ఉంది. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి నుంచి మద్దతు దొరుకుతుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ధన ప్రవాహం ఉంది. విద్యార్థులు శుభవార్తలను వింటారు. భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విదేశీ వనరుల నుంచి లాభాలున్నాయి. ఆదాయంలో పెరుగుదలతోపాటు చేసే పనిలో ఇతర ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
ధనుస్సు రాశి
హనుమజ్జయంతి నుంచి ఈ రాశివారి సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శారీరకంగా సౌకర్యాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో విజయం సాధించడంతోపాటు పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించడంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. అంకిత భావంతో పనిచేయడంవల్ల ప్రశంసలు దక్కుతాయి.
కుంభ రాశి
ఈ రాశివారికి ధనలాభం ఉంది. వ్యాపారం బాగుంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ లభించబోతోంది. వృత్తి, వ్యక్తిగత జీవితంలో మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి.












Click it and Unblock the Notifications