సెప్టెంబరు 2 నుంచి ఈ రాశులకు డబ్బు సంచులను మోసుకొస్తున్న శుక్రుడు
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో శుక్రుడు ప్రతి రాశిలో 26 రోజులు సంచారం చేస్తాడు. అన్ని రాశులపై వీటి ప్రభావం ఉంటున్నప్పటికీ కొందరికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనాలు కలగజేస్తున్నాయి. అయిదే అశుభ స్థానంలో ఉంటే వ్యతిరేక ప్రభావాలు కలుగుతాయి. ఉత్తర ఫాల్గుణిలో ఉన్న శుక్రుడు త్వరలోనే హస్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల వచ్చేనెల రెండోతేదీ నుంచి కొన్ని ప్రభావాలు కలుగుతున్నాయి.
సింహరాశి
వీరికి ఎంతో బాగుంటుంది. అన్ని పరిస్థితుల్లో సులువుగా విజయాలు సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు తోడవుతాయి. డబ్బుకు సంబంధించి రాబడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొన్ని శుభవార్తలను వినడంతోపాటు ధనలాభాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి.

కన్యారాశి
వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఏ రంగంలో అడుగు పెట్టినా, ఏ పని తలపెట్టినా సులువుగా విజయం సాదిస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతికి అవకాశం ఉంది. ఈ సమయం అంతా వీరికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభించింది. పనితీరుపై ప్రశంసలు లభిస్తాయి. ఇదే క్రమంలో కొంతకాలం నుంచి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. శత్రువుల రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్టం తోడుండి అన్ని పనుల్లో విజయాలు సాధిస్తారు.
మకర రాశి
వీరికి ఈ సమయం అనుకూలగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలుండటంతోపాటు ఇతర ప్రాంతాలకు విస్తరణ గురించి ఆలోచన చేస్తారు. ఊహించనిరీతిలో ధనలాభాలున్నాయి.












Click it and Unblock the Notifications