ఏప్రిల్ నెల ఈ రాశులకు అద్భుతంగా ఉంటుంది
ఏప్రిల్ నెలలో గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. బుధుడు తిరోగమన దశ, అస్తంగత్వ దశలో సంచరించనున్నాడు. సూర్యుడు, కుజుడు, శుక్రుడు కూడా రాశిచక్రాలను మార్చుకుంటున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉండనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
బుధుడి అస్తంగత్వం
వచ్చేనెల రెండో తేదీ నుంచి బుధుడు ఈ రాశిలో తిరోగమనం చేస్తాడు. కొందరు లాభాలను పొందితే మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి లాభాలున్నాయి. ఈ రాశిలో బుధుడి అస్తంగత్వం కారణంగా జ్ఞాపకశక్తి, బలహీనంగా ఉంటుంది. అభద్రతా భావం చుట్టుముడుతుంది. సింహ, కన్య, తుల, కర్కాటక రాశులవారికి సవాళ్లు ఎదురవుతాయి.

మేష రాశిలో సూర్యుడు
వచ్చేనెల 13న ప్రవేశించి మే 14 వరకు ఉంటాడు. తర్వాత వృషభరాశిలోకి వెళతాడు. గురువు కలయికతో జరుగుతుంది. ఈ రెండింటి కలయిక 12 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. మేషరాశితోపాటు అనేక రాశులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
మీనరాశిలో బుధుడు
గ్రహాల రాకుమారుడు బుధుడు వచ్చేనెల 19న మీన రాశిలో ఉదయిస్తాడు. దీనివల్ల అదృష్టం వెంటే ఉంటుంది. మీనరాశిలో బుధుడు ఉదయించడంవల్ల మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, మీనరాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది.












Click it and Unblock the Notifications