26వ తేదీ నుంచి ఈ రాశులకు అద్బుత ధనయోగం
జ్యోతిష్యంప్రకారం బుధుడు జాతకాల్లో ప్రత్యేక స్థానంలో ఉంటే ఎటువంటి లోటు ఏర్పడదు. ప్రతి నెలా రాశిని మార్చే బుధుడు ఈనెల 26వ తేదీ నుంచి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొందరి జాతకాలు శుభస్థానంలోకి వెళతాయి. అదృష్టం కలిసిరావడతోపాటు డబ్బును పొందుతారు. ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసిరానుందో వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. వ్యాపారస్తులకు కలిసివస్తుంది. కుటుంబ జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. జీవితం సంతోషంగా గడుస్తుంది. కోరకున్న కోరికలన్నీ బుధుడి అనుగ్రహం వల్ల సులభంగా నెరవేరతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో చేసే పనులన్నీ సత్వరమే పూర్తవడంతోపాటు లాభాలను తెచ్చిపెడతాయి.

మిథున రాశి
వీరికి సంతోషంతోపాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురుచూసేవారి కోరిక నెరవేరుతుంది. కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పనితీరు మరింత మెరుగుపడుతుంది. కొత్త బాధ్యతలను నిర్వర్తిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్నవారికి జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
కన్యా రాశి
వ్యాపారస్తులకు ప్రధానంగా కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. కష్టమైన పనుల్లో కూడా సులువుగా విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం శృంగార భరితంగా సాగుతుంది. సులభంగా విజయాలు సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లడంవల్ల మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్యం బాగుటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications