జులై నెలలో ఈ రాశులకు మహారాజ యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెల ఎంతో విశిష్టమైన నెల. ఈ నెలలోనే కొన్ని రాశులవారికి ఆర్థిక, వ్యాపార, వృత్తి రంగాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలోనే చాలా గ్రహాలు తమ రాశి చక్ర గుర్తులను మారుస్తాయి. సూర్యుడు, శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తాయి.
కుజుడు మేషరాశిలో ఉన్నాడు. బృహస్పతి వృషభరాశిలోకి, కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు కుంభరాశిలో తిరోగమన దశలో సంచరించనుంది. బుధుడు కూడా కర్కాటక రాశిలోకే ప్రవేశించనున్నాడు. ఇన్ని గ్రహాల సంచారంవల్ల ఏ రాశులకు ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

వృషభ రాశి
ఈ రాశివారికి జులై నెల ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఆర్థికంగా లాభపడేందుకు అనేక అవకాశాలు తలుపు తడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్లు అందుకుంటారు. కొత్తగా ఆదాయ వనరులు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి వస్తుంది.
కర్కాటక రాశి
వీరి కల జులైలో నెరవేరుతుంది. కొత్త ఉద్యోగాలు రావడంవల్ల అవి పొందినవారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. మనసు ఆనందంతో నిండిపోతుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.
కన్యా రాశి
తమ కెరీర్ లో మంచి విజయాలను సాధిస్తారు. అదృష్టం తోడుంటుంది. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయి. కష్టమైన పనులు ఎన్ని ఉన్నప్పటికీ అదృష్టం తోడుండటంవల్ల విజయం సాధిస్తారు. కోర్టు కేసుల్లో కూడా గెలుపొందుతారు.
తులా రాశి
ఒకరకంగా ఈ రాశివారికి జులై నెల వరం అని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. వారి ఆనందానికి అవధులే ఉండవు. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. కలలన్నీ నెరవేరతాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది.
మకర రాశి
శనిదేవుడి ఆశీస్సులు లభిస్తాయి. జులై నెల వీరికి సుఖాలు, విలాసాలతో నిండిపోతుంది. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఆనంద కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.












Click it and Unblock the Notifications