శక్తివంతమైన చంద్ర యోగంతో ఈ రాశులకు మహా ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం వ్యక్తి జాతకంలో చంద్రుడు శుభస్థానంలో ఉంటే మంచి ధనలాభాలుంటాయి. ఊహించనిరీతిలో డబ్బులు పొందుతారు. చంద్రుడు కన్యారాశిలోకి ప్రవేశించడంవల్ల రవి యోగం, సధ్య యోగం ఏర్పడ్డాయి. అవి అత్యంత శక్తివంతమైన యోగాలు. వీటి ప్రభావం కూడా రాశులవారిపై ఉంటుంది. ఈ యోగాలవల్ల ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మిథున రాశి
ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతి కూడా ఉంది. వ్యాపారాలు ప్రారంభించేవారికి సులభంగా విజయాలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి లేదంటే సన్నిహితులతో కలిసి విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. తోబుట్టువులతో సమస్యలు వస్తున్నప్పటికీ అవి పరిష్కారమవుతాయి. జీవితంలో ఎదుగుదలకు ఈ సమయం బాగా కలిసివస్తుంది.

సింహ రాశి
ఈ రాశులకు ఈ యోగాలవల్ల లక్ష్మీదేవి నుంచి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతారు. కుటుంబంలో వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేయడంతోపాటు ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యాగాలు చేసేచోట మంచిపేరును సంపాదించుకుంటారు. పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు.
మీన రాశి
మిత్రులతో, సన్నిహితులతో కలిసి ఆనందంగా జీవిస్తారు. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. వైవాహిక జీవితంలో భార్యపై ప్రేమ బలోపేతం అవుతుంది. వేధిస్తున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. జీవితంలో కొన్నాళ్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ సమయంలో దూరమవుతాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి అనువైన సమయమని పండితులు తెలియజేస్తున్నారు. ఎంత శ్రమను ఎదుర్కొంటే అంత ఫలితాన్ని పొందుతారు.












Click it and Unblock the Notifications