గజకేసరి రాజయోగంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
జ్యోతిష్యం ప్రకారం ఏర్పడే కొన్ని యోగాలు మనిషి వ్యక్తిగత జీవితంలో అనుకోని మార్పులకు కారణమవుతుంటాయి. అప్పటివరకు పేదవాడిగా ఉన్నవాడు కోటీశ్వరుడవుతాడు. ఏ పని తలపెట్టినా అన్నింటిలో ధనలాభం కలగడమేకాకుండా పట్టుకున్నదల్లా బంగారంలా మారుతుంది. ఇటువంటి యోగాలు జాతకంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలా ఏర్పడిందే గజకేసరి యోగం. ఈనెల 15న వృషభరాశిలో ఈ యోగం ఏర్పడింది. విఘ్నాలను దూరం చేయడంతోపాటు అఖండ ధనయోగానికి కారణమని పండితులు తెలియజేస్తున్నారు.
కర్కాటక రాశి
గజకేసరి యోగంవల్ల న్యాయపరమైన కేసుల్లో విజయం సాధిస్తారు. సోదరులతో అనుబంధం బలపడుతుంది. ఇక రాదు అనుకొని వదిలేసిన డబ్బు సకాలంలో చేతికి అంది ఆశ్చర్యపరుస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులను అధిరోహిస్తారు. గతంలో మొదలై ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో జెట్ వేగంతో ముందుకు వెళతాయి. కొత్త ఇల్లును కొనుగోలు చేయడంతోపాటు పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది.

సింహారాశి
వీరికి ఆకస్మిక ధనయోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తికావడంతోపాటు కొత్త ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విందులు, పెళ్లిళ్లలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని వారితో అనుబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. పనితీరు బాగుండటమే దీనికి కారణం.
వృశ్చిక రాశి
గజకేసరి యోగంవల్ల వీరికి అఖండ ధనయోగం కలుగుతుంది. బంధువులతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ యోగానికి గొప్ప అవకాశం కనపడుతోంది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు. అంతేకాదు.. పెండింగ్ లో ఉన్న పనులను కూడా ఈ సమయంలో పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications