లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశులవారిపై కనక వర్షం

మీన రాశిలోకి బుధుడు ప్రవేశించడం.. అప్పటికే కుజుడు అక్కడే ఉండటంతో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. దీని వల్ల కొన్ని రాశుల వారు డబ్బు సంపాదించడంతోపాటు శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యక్తి జీవితంలో సంపద, శ్రేయస్సు, విజయాన్ని తీసుకువస్తుంది. బుధుడు తెలివితేటలకు, శుక్రుడు భౌతిక సమృద్ధికి కారకుడు. వీరిద్దరి కలయికవల్ల జాతకుల అదృష్టం రెట్టింపు అవుతుంది. అదే సమయంలో బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య రాజయోగం ఏర్పరుస్తున్నారు. ఒకేసారి రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి.

మిథున రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగరీత్యా పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఇంట్లో ప్రేమ, సంతోషంతో కూడిన వాతావరణం నెలకొంటోంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

these zodiac signs will get more money due to lakshmi narayana rajayoga 2024

సింహ రాశి
వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

కన్యా రాశి
అకస్మాత్తుగా డబ్బులు వస్తాయి. ఏ పనిలోనైనా అదృష్టం తోడుంటుంది. శత్రువులను ఓడిస్తారు. జీవిత భాగస్వామితో స్నేహపూర్వకమైన సంబంధాలను కొనసాగిస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తారు. తోబుట్టువులకు మద్దతుగా నిలుస్తారు.

మకర రాశి
కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం ఉంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రేమను పొందుతారు.

కుంభ రాశి
చేతికి డబ్బు అందుతుంది. భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది. మంచి పనితీరు కనపరచడంతోపాటు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+