రాహువు కటాక్షంతో ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం కలుగుతోంది

జ్యోతిష్యం ప్రకారం మీన రాశిలో సంచారం చేస్తున్న రాహువు తొమ్మిది నెలలు అక్కడే ఉంటుంది. మీన రాశి రాహువుకు శత్రు స్థానం. రాక్షస గ్రహం, వక్ర గ్రహమైన రాహువుకు వృషభం, సింహం, కన్య, తుల, మకరం, కుంభ రాశులు ఇష్టమైనవి. ఇక్కడి నుంచి వెళ్లేవరకు ఈ రాశులకు ఏదోవిధమైన యోగాన్ని ఇస్తూనే ఉంటాడు. వారికి రాహువు ఏవిధమైన ప్రయోజనాలను కలిగించనున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

వృషభం
వీరికి ఉన్నతస్థాయిలో శుభాలను రాహువు ఇస్తాడు. అన్ని సమయాల్లోను అండగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అంచనాలకు మించి విజయవంతమవుతాయి.

these zodiac signs will get more money due to rahu gochar in pisces 2024

సింహం
వీరికి రాజయోగాన్ని కల్పిస్తాడు. ఉద్యగోంతోపాటు రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఈ రాశివారికి ప్రాబల్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్లడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. రెండుసార్లు ధనయోగాలు పడతాయి. సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

కన్య
ధనధాన్యాలకు లోటులేదు. పదోన్నతులు లభిస్తాయి. వివిధ మార్గాలద్వారా ఆదాయం లభిస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. విదేశాల్లో సంపాదించుకోవడానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడతారు.

తుల
రాహువు అండగా ఉంటాడు. ఆదాయానికి, గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉంటదు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. లాటరీ, జూదాలు కలిసి వస్తాయి. అవి కలిసి వస్తాయని ఆడొద్దు. అలవాటుంటే మానుకోండి.

మకరం
వీరిని రాహువు అనేక విధాలుగా ఆదుకుంటారు. వృద్ది, పురోగతి బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది.

కుంభం
ధన స్థానంలో రాహువు ఉండటంవల్ల ఆకస్మిక ధనలాభం ఉంది. వివిధ మార్గాలద్వారా ఆదాయం వస్తుంది. విదేశీ సొమ్మును అనుభవిస్తారు. ఆ యోగం పట్టుకుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడంతోపాటు మాటకు విలువ పెరుగుతుంది. తీర్థయాత్రలకు, విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+