శనిదేవుడు ఈ రాశులకు అద్భుతమైన వరాన్ని ప్రసాదిస్తున్నాడు
కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు అతి నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. సాధారణంగా శని అనగానే అందరూ భయపడతారు. కానీ మంచి పనులు చేసినప్పుడు శనిదేవుడు మంచి ఫలితాలను ఇవ్వడంతోపాటు మంచి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని వచ్చే ఏడాది మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొన్ని రాశులవారికి మంచి ఫలితాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఏయే రాశులవారికి శుభ పరిణామాలు ఎదురుకాబోతున్నాయో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడి ద్వారా ఆదాయ మార్గం దొరుకుతుంది. అనుకున్న లక్ష్యానికి చేరువవుతారు. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి కోరుకున్నచోటకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

వృశ్చిక రాశి
ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రమోషన్లు పొందుతారు. అదృష్టం తోడుండటంవల్ల అనుకోకుండా ఆర్థిక లాభాలను పొందుతారు. అర్థాష్టమ శని నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నవారి కోరిక ఈ సమయంలోనే నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.
మకర రాశి
అదనపు ఆదాయ వనరులు వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే వీరికి సాడే సతి నుంచి విముక్తి కలుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడుతుంటారు. వారికి కోపం తగ్గిపోతుంది. ఉద్యగం చేసేవారు, వృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. గతంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications