శుక్రుడితో మహా పురుష యోగం.. మహా ధనయోగం

దాంపత్య జీవితం, ప్రేమ వ్యవహారాలకు కారకుడైన శుక్రుడు ఈనెల 19వ తేదీ నుంచి అక్టోబరు 13వ తేదీ వరకు తులారాశిలో సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు మాలవ్య రాజయోగం పడుతుంది. శుక్రుడు వ్యక్తి జాతకంలో కేంద్ర స్థానంలో ఉంటే మాలవ్య మహాపురుష యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏ రంగంలో ఉన్న వ్యక్తులు ఆ రంగంలో అత్యంత ప్రాధాన్యతను పొందుతారు. మరికొన్ని రాశులకు మహా భాగ్య యోగం పడుతోంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేషం
వీరికి ఆస్తి విలువ పెరుగుతుంది. కలలో కూడా ఊహించనిరీతిలో అదృష్టం పడుతుంది. శుభవార్తలను వింటారు. ధనవంతులైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమవుతుంది. వృత్తి, వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తాయి.

these zodiac signs will get more money due to shukra transit in libra

మిథునం
ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం రోజురోజుకు పెరగడంతోపాటు ఆకస్మిక ధనలాభాలానికి అవకాశం ఉంది. ఉద్యోగం చేసేచోట ప్రతిభ బయటకు వచ్చి మంచి పేరు వస్తుంది. పిల్లలు లేనివారికి సంతాన యోగం కలుగుతోంది. జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.

కర్కాటకం
వీరు ఏ రంగంలో ఉన్నా అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంలో ఎదురవుతున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవడంతోపాటు వ్యవహారాలన్నీ సానుకూలంగా జరుగుతాయి. సమాజంలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు.

కన్య
వీరికి మహా భాగ్య యోగం ఏర్పడింది. విదేశీ యానానికి ఎదురవుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. మనసులో కోరికలు నెరవేరడంతోపాటు కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. పెద్దల నుంచి ఆస్తి సంక్రమిస్తుంది.

తుల
వీరికి సంపద పెరుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. వృత్తి, వ్యాపారాలకు గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలను సులువుగా పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు. ఉద్యోగంలో మంచి ప్రాధాన్యం లభిస్తుంది.

మకరం
ఉద్యోగానికి సంబంధించి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి క్షణం కూడా తీరిక ఉండదు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభదాయకంగా మారతాయి. నిరుద్యోగులతోపాటు ఉద్యోగులకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు మంచి కంపెనీలో మంచి ఉద్యోగంలోకి మారతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+