14వ తేదీ వరకు ఈ రాశులవారు ఏది పట్టుకున్నా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం ఈనెలలో రెండో వారం ఈరోజు నుంచి ప్రారంభమవుతోంది. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కొన్ని గ్రహాలు, నక్షత్రాలు సంచారం చేస్తుండటమే ఈ ప్రాధాన్యతకు కారణం. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు సంచరించబోతున్నాయి. దీనివల్ల శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ వారం ఎక్కువగా లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
మేషరాశి
నక్షత్రాలు ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల అనేక లాభాలున్నాయి. పనుల్లో ఏవైనా అడ్డంకులన్నా తొలగిపోతాయి. దీంతో వీరు ఈ సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉండటంతోపాటు అద్భుతమైన శక్తితో విపరీతమైన ధనలాభాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి
ఆర్థికంగా మంచి లాభాలున్నప్పటికీ అనారోగ్యం వేధిస్తుంది. అయినా ఈ వారం అంతా ఎంతో శుభప్రదంగా గడిచిపోతుంది. అనారోగ్యంవల్ల మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సాధ్యమైనంతమేరకు ఎంత ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి.
మిథున రాశి
జీవితంలో వృద్ధి సాధిస్తారు. పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. వేధిస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది.
సింహ రాశి
భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్వేగానికి లోనవుతారు. ఈ వారం అంతా లాభసాటిగా నడుస్తుంది. ఎదుటివారిని ఆకర్షిస్తారు. మాటతీరు అద్భుతంగా ఉండటంవల్ల ఎక్కువమంది ఆకర్షితులవుతారు.
కన్యా రాశి
ఈ రాశివారికి నక్షత్రాల మార్పు వల్ల విపరీతమైన ధనలాభాలున్నాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. కెరీర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
మకరరాశి
ఈ సమయం బాగా కలిసివస్తుంది. ఈ వారం మొత్తం శృంగారభరితంగా సాగుతుంటుంది. ఆర్థికంగా అనేక లాభాలున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications