24వ తేదీ నుంచి ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం
ఈనెల 24వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశించే శుక్రుడు అదే రాశిలో ఉన్న కేతువుతో కలిసి సంచరిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాలు వచ్చేనెల 18వ తేదీ వరకు కలిసివుండటంవల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు ఎదురుకాబోతున్నాయి. ఊహించనిరీతిలో సహాయ సహకారాలు అందడంతోపాటు అకస్మాత్తుగా డబ్బులు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రధానంగా ఈ సమయం ఈ రాశులకు వరం లాంటిదని చెప్పొచ్చు. మకరం, మీనం, వృశ్చికం, కన్య, సింహరావి, వృషభరాశివారికి శుభ పలితాలు కలుగుతాయి.
సింహరాశి
వాయిదా పడుతున్న శుభకార్యాలు జరుగుతాయి. డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి సమస్య పరిష్కారం కావడంతోపాటు అదనపు మార్గాలద్వారా ఆదాయం వస్తుంది. స్వగ్రామాల్లోనే నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

వృషభం
భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వృత్తితోపాటు వ్యాపారాల్లో వస్తున్న నష్టాల నుంచి బయటపడతారు. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు. పిల్లలు మంచి విజయాలను దక్కించుకుంటారు.
వృశ్చికం
వదిలేసిన సొమ్ము చేతికి అందుతుంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఉన్నతస్థాయి కుటుంబానికి చెందినవారితో వివాహం కుదురుతుంది. వ్యాపారంతోపాటు వృత్తిలో కూడా లాభం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది.
కన్య
ఆదాయం పెరగడంతోపాటు ఆధ్యాత్మిక విషయాలపై అనురక్తి పెంచుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పదోన్నతి ఉంది. సమాజంలో పలుకుబడి పెరగడంతోపాటు పరిచయాలు పెరుగుతాయి. తల్లిదండ్రులను కలుసుకుంటారు.
మీనం
పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ప్రేమలో పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్స లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో పేరు తెచ్చుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. విభేదాలు సమసిపోతాయి.
మకరం
విదేశాల నుంచి మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ సొమ్మును అనుభవిస్తారు. వ్యాపారంతోపాటు వృత్తిలో కూడా లాభాలున్నాయి. ధనయోగాలున్నాయి. జీవితంలో శుభ పరిణామాలు ఈ సమయంలోనే చోటుచేసుకుంటాయి. తండ్రి నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందుతాయి.












Click it and Unblock the Notifications