మీనరాశిలో రాహువు సంచారం.. ఈ రాశులవారు విమానంలో ప్రయాణిస్తారు

విదేశాలకు వెళ్లాలంటే రాహువు అనుగ్రహం ఉండాలి. ప్రస్తుతం ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు, శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి అక్కడ స్థరపడటానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ సఫలం కావాలంటే వీరిద్దరి అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, మకరం, మీన రాశులకు విదేశీయానం ఉంది. విదేశీ సొమ్మును అనుభవించడంతోపాటు పలు శుభ పరిణామాలు కూడా ఈ రాశులవారి జీవితాల్లో చోటుచేసుకోబోతున్నాయి.

మేషం
వ్యయ స్థానంలో రాహువు ఉన్నాడు. దీనివల్ల విదేశాల్లో ఉద్యోగానికి అవకాశాలున్నాయి. ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. అక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంది. ధనస్థానంలో శుభగ్రహాలున్నాయి. విదేశీ ధనాన్ని అనుభవించే అవకాశం కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలకు ఇదే మంచి సమయం.

these zodiac signs will go to foreign countries due to rahu in pisces 2024

వృషభం
ఇతర దేశాల్లో ఉద్యోగానికి సంబంధించిన పరీక్షలు, ఇంటర్వ్యూల్లో వీరు విజయాలను సాధిస్తారు. విదేశీ ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలున్నాయి. విదేశాలకు ఉద్యగ నిమిత్తం వెళతారు. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితోనే పెళ్లి కుదురుతుంది.

మిథునం
విదేశీ ఉద్యోగాలకు సమయం ఎంతో అనుకూలంగా ఉంది. తీర ప్రాంతం ఎక్కువగా ఉండే దేశాలకు వెళ్లి స్థిరపడటం జరుగుతుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అక్కడే స్థిరపడతారు. అంచనాలకు మించిన ఉద్యోగంతోపాటు భారీగా ఆదాయం కూడా ఉండనుంది.

కర్కాటకం
చిరకాల వాంఛ నెరవేరుతుంది. చిన్న చిన్న ప్రయత్నాలతోనే విదేశీ ఆఫర్లు అందుకుంటారు. పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. విదేశాలకు వెళ్లినవారు అక్కడే స్థిరపడతారు.

మకరం
వీరికి తృతీయ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నాడు. దీనివల్ల విదేశీ యానం ఉంటుంది. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా విదేశీ యాన యోగం కలుగుతుంది. అక్కడే స్థిరపడి ఆదాయం పెంచుకుంటారు. విదేశాల్లో ఉద్యోగాలవల్ల ప్రతిభా పాటవాలు మెరుగుపడతాయి.

మీనం
విదేశీయానానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో గెలుపొందారు. అతి సమీప భవిష్యత్తులోనే విదేశీ ఉద్యోగం సంపాదించే అవకాశం కనపడుతోంది. తృతీయ స్థానంలో శుభ గ్రహాలు సంచరిస్తున్నాయి. దీనివల్ల అతి కొద్ది ప్రయత్నంతోనే విదేశాల్లో స్థిరపడే అవకాశం కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+