బుధుడి రాశి మార్పుతో ఈ రాశులకు డబ్బు, విజయం, పెళ్లి!

గ్రహాల రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, తర్కం, వ్యాపారం, మంచిగా మాట్లాడే విధానానికి, జ్ఞానానికి కారకుడు. ఈనెల 30వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అది సూర్యుడి సొంతరాశి. అప్పటికే ఆ రాశిలో సూర్యుడు సంచారం చేస్తుంటాడు. బుధుడు సూర్యుడి చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజుల సమయం తీసుకుంటాడు. సెప్టెంబరు 14వ తేదీ వరకు సింహరాశిలోనే సంచరించే బుధుడి వల్ల ఏయే రాశులవారికి బాగా కలిసిరానుందనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు బాగుంటారు. వివాహం కానివారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెళ్లి కుదురుతుంది. బుధుడి సంచారం ఈ రాశివారికి మంచి ఫలితాలను తీసుకువస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు.

these zodiac signs will have money success and marriage due to Mercury s change in sign

ధనస్సు రాశి
చేసే ప్రతి పనిలోను విజయాన్ని అందుకుంటారు. అందుకు మీ కృషి తోడ్పడుతుంది. ముఖ్యమైన పనులు కూడా చాలా సులభంగా పూర్తిచేస్తారు. మీ సామర్థ్యంపై అందరికీ నమ్మకం కలుగుతుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. డబ్బు చాలా సులువుగా సంపాదిస్తారు. వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడివుంటుంది.

వృశ్చిక రాశి
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం. వారు కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రయాణాలు కూడా కలిసివస్తాయి. లాభసాటిగా మారతాయి. పోట పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంది. లాభాలు రావడంద్వారా ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆస్తులు కూడా ఈ రాశివారికి పెరిగే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+