కర్కాటకంలో త్రిగ్రాహి యోగం.. 5 రాశులకు ధనయోగం
గ్రహాలు నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి అనుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. జులైలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీనివల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించడంతోపాటు వారి ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. జులై నెలలో ఏ రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
జాగ్రత్తగా పనులు చేసుకోవాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. ఆస్తికి సంబంధించిన వివాదాల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ సంబంధాలు బలపడటంతోపాటు కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందినప్పటికీ అంతిమంగా బాగానే ఉంటుంది. ఖర్చులు పెరగకుండా నియంత్రించుకోవాలి.

వృషభ రాశి
ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. రెండోవారంలో కొత్త పరిచయాలు అవుతాయి. ప్రేమ సంబంధాలు శుభప్రదంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. శారీరకంగా, మానసికంగా కొంత అలసిపోతారు. పనులు చేయడానికి అవసరమైన ధైర్యాన్ని ప్రోది చేసుకోవాలి. పనుల విషయంలో సహనం, ధైర్యం అవసరం.
మిథున రాశి
స్నేహితుల సహాయంతో అపార్థాలు తొలగిపోవడంతోపాటు ప్రేమ సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనులు చిన్న ప్రయత్నంతో ప్రారంభమవుతాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని అవమానించడానికి చూస్తారు. అయితే వారు విజయం సాధించలేరు. ఈ సమయలో మీరు తెలివిగా, కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి
ఉద్యోగులకు ప్రమోషన్ మీద కోరుకున్నచోటకు బదిలీ జరుగుతుంది. నెల మధ్యలో దూర ప్రయాణాలున్నాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. బంధువులతో అనుబంధం పెరుగుతుంది. మాట్లాడే మాటలపై పూర్తి నియంత్రణ ఉండాలి. స్నేహితుల సహకారంతో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు.
సింహ రాశి
అదృష్టం కలిసివస్తుంది. భూమి లేదంటే ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాలి. విలాసాలకు డబ్బును ఖర్చు చేస్తారు. నెల మధ్యలో కుటుంబంతో కలిపి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సన్నిహితులతో సమన్వయం చేసుకోవాలి.












Click it and Unblock the Notifications