శుక్రుడి సంచారంతో ఈ రాశులకు అఖండ ధనయోగం
సంపద, సంతోషం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే శుక్రుడు వచ్చే నెలలో తన రాశిని రెండుసార్లు మార్చబోతున్నాడు. జులై ఏడోతేదీ ఉదయం శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి అక్కడే 23 రోజులు సంచారం చేస్తాడు. తిరిగి జులై 31వ తేదీ మధ్యాహ్నం సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ 24 రోజులు కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనాలు దక్కనున్నాయి. శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సంపద, శ్రేయస్సు పెరిగి ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారని, ఆర్థికంగా బలపడతారని, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేష రాశి
శుక్రుడి డబుల్ సంచారం ఈ రాశివారికి సంపదను తెస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. దీనివల్ల ఆర్థికంగా బలపడతారు. పెళ్లికానివారికి వివాహం కుదురుతుంది. భూమి లేదంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. కెరీర్ దూసుకువెళుతుంది. జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.

కర్కాటక రాశి
ధన ప్రవాహానికి కొత్త మార్గాలు దొరుకుతాయి. ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం కనపడుతోంది. జీవితం సంతోషంగా గడవడమే కాకుండా మీరు ఎంచుకున్న కెరీర్ లో విజయాల మెట్లు అధిరోహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారంతోపాటు ఉద్యోగంలో కూడా పురోగతి దొరుకుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా బాగుంంది. చేసే ప్రతి పనిలోను అదృష్టం కలిసివస్తుంది.
సింహ రాశి
ఊహించనిరీతిలో ఆదాయం లభిస్తుంది. భౌతికంగా సుఖపడతారు. సమాజంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. పనులకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రేమకు సంబంధించి మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడంతో జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు పయనిస్తారు. జీవితం సంతోషంగా గడుస్తుంది.
వృశ్చిక రాశి
ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి కలగడంతో తీర్థయాత్రలకు వెళతారు. సంపద పెరగడంతోపాటు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిద్వారా లాభం ఉంది. ఆర్థికంగా పరిస్థితి మెరుపడుతుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి.












Click it and Unblock the Notifications