12 ఏళ్ల తర్వాత కుబేర యోగం.. ఈ రాశులపై కుబేరుడి కనక వర్షం
జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి 2024 మే నెల ఒకటో తేదీ నుంచి 2025 మే 13వ తేదీ వరకు వృషభరాశిలో ఉంటాడు. దీనివల్ల కుబేర యోగం ఏర్పడుతోంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడింది. ఇది చాలా శుభమైనది. దీనివల్ జాతకుడు లేదంటే జాతకురాలికి సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. ధనానికి, సుఖానికి, శ్రేయస్సుకు, సంపదకు లోటుండదు. జీవితమంతా సుఖంగా గడుపుతారు. ఎవరి జాతకంలో కుబేర యోగం ఏర్పడితే వారికి కృషి, అదృష్టం, ధైర్యంవల్ల సంపదను కూడగడతారు. ఏకాగ్రత, ధృఢ నిశ్చయంతో ఏ పనినైనా పూర్తిచేస్తారు. ఏదైనా పనిని తలపెడితే దాన్ని పూర్తిచేసేవరకు నిద్రపోరు. వ్యాపారం బాగా చేస్తారు. డబ్బును సంపాదించడంలో వీరు నిష్ణాతులు. ఏయే రాశులవారు కుబేర యోగంవల్ల లాభపడుతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్త ఆదాయ వనరులు వస్తాయి. దీనివల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి సమయం. వ్యాపారంలో లాభాలుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన, ధాన్యాల నిల్వలు నిండుకుంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు మంచి పురోభివృద్ధి సాధిస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును కుబేర యోగం కల్పిస్తుంది. వస్తువు సౌఖ్యాలు అమరుతాయి. విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది చాలా మంచి శుభ సమయం కావడంతో విద్యకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటాయి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. ఉద్యోగం, వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు.
సింహ రాశి
ఈ రాశివారి నిద్రకు భంగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. కొత్తగా ఆదాయ వనరులు దొరకడంతో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని ప్రేమికులు చవిచూస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.












Click it and Unblock the Notifications