జులై నెలలో ఈ నాలుగు రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహ వర్షం
జ్యోతిష్యం ప్రకారం జులై నెల చాలా కీలకమైంది. ఆషాఢ మాసం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతోంది. జులై నెలాఖరుకు శుక్రుడు కర్కాటక రాశిని వదిలిపెట్టి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెలలో కొన్ని రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహ వర్షం కురిపించనుంది. ఈ నెల మొత్తం వారికి బాధలు, కష్టాలు ఉండవు. నిలిచిపోయిన పెండింగ్ పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఏయే రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుందో తెలుసుకుందాం. ఇదే నెలలో కుజుడు వృషభరాశిలో, సూర్యుడు, బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తారు.
మేష రాశి
ఈ నెల వీరికి చాలా బాగుంటుంది. అదృష్టం తోడుండటంవల్ల ఊహించని రీతిలో ధనలాభం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు. ఆర్థికంగా స్థిరపడతారు. అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని వెచ్చిస్తారు. ధార్మిక కార్యక్రమాలతోపాటు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు.

సింహ రాశి
ఈనెల చాలా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. శుక్రుడి నుంచి ప్రత్యేకంగా ఈ రాశివారు అనుగ్రహాన్ని సంపాదిస్తారు. భూమి లేదంటే వాహన సౌకర్యం కలుగుతుంది. వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా గడపడటంతోపాటు వీరి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు కూడా తొలగిపోతాయి.
మకర రాశి
వ్యాపారస్తులకు మంచి లాబాలున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా మెరుగుపడటంతో సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఊహించనిరీతిలో శుభవార్తలను వింటారు.
కుంభ రాశి
ఈ రాశివారికి ఈ నెల బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం విస్తారంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. ఈ నెల మొత్తం వీరికి గ్రహాలు, నక్షత్రాలు అదృష్టాన్ని తెస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.












Click it and Unblock the Notifications