నీచభంగ రాజయోగంతో ఈ రాశులకు రాజయోగం
ఈనెల పదోతేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మీనరాశి బుధుడికి శత్రు క్షేత్రం కావడంతోపాటు నీచ క్షేత్రం. అలాగే బుధుడు వక్రించాడు. ఇలా మూడు దోషాలతో ఉన్న బుధుడివల్ల అశుభాలే ఎక్కువగా జరుగుతాయి. అయితే అదే రాశిలో శుక్రుడివల్ల బుధుడికి నీచ భంగం జరిగింది. దీనివల్ల బుధుడు కొన్ని రాశులకు రాజయోగాన్ని కల్పించనున్నాడు. దీన్ని నీచభంగ రాజయోగం అంటారు. దీనివల్ల ప్రధానంగా ఆరు రాశులవారికి శుభయోగాలు ఏర్పడతాయి. వాటివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో శుక్రుడితో కలిసిన బుధుడు తప్పకుండా విదేశీ యానానికి, విదేశీ సొమ్ము అనుభవించడానికి అవకాశం కలిగిస్తాడు. బాగా పొదుపు పాటించి, ఖర్చులు తగ్గించు కోవడం జరుగుతుంది. ఫలితంగా బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశముంది. గృహ, ఆస్తి ఒప్పందాలు కుదర్చుకుంటారు. ఉద్యోగంలో శత్రువుల బెడద తగ్గు తుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సంఖ్య తగ్గి లాభాలు పెరగడం ప్రారంభిస్తాయి.

మిథునం
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఆస్తి సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల్లో లాభం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా మారతాయి. తల్లిదండ్రులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.
సింహం
ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారం కలిసివస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
కన్య
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. సంపన్నులతో ప్రేమలో పడతారు. పెళ్లి కుదురుతుంది. వృత్తి జీవితం బిజీగా మారుతుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల
వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీతభత్యాలు, రాబడి పెరుగుతుంది. కోరికలు నెరవేరతాయి. వ్యాపారాల్లో లాభాలున్నాయి.
మకరం
వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి.












Click it and Unblock the Notifications