బృహస్పతి వల్ల ఈ రాశులవారు మహర్జాతకులవుతున్నారు

జాతకంలో బృహస్పతి శుభ స్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. పెద్దల పట్ల గౌరవంతోపాటు సంపద కలిసి రావడం, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడంలాంటివన్నీ చేస్తారు. వచ్చే నెల 20వ తేదీన బృహస్పతి మృగశిర నక్షత్రంలోకి మారుతున్నాడు. ఇలా నక్షత్ర సంచారం చేస్తుండటంవల్ల అధిక సంఖ్యలో రాశులకు బాగా కలిసివస్తోంది. గురుడివల్ల కోరికలన్నీ తీరడంతోపాటు అనుకున్న లక్ష్యాలను కూడా చేరుకుంటాడు. ఏయే రాశులవారికి ఏవిధంగా కలిసిరాబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి
వ్యాపారం కలిసిరాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోతారు. ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళతారు.

these zodiacs signs golden time will starts due to jupieter transit

వృషభం
విద్యార్థులకు అన్నివిధాలుగా కలిసివస్తుంది. అన్ని పనుల్లో విజయం దక్కుతుంది. కోరుకున్న కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటారు.

మిథున రాశి
జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందడంతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.

కర్కాటక రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరంగా వచ్చే మార్పులు మంచి జీవితాన్నే కల్పిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.

సింహం
ఖర్చులు భారీగా పెరుగుతాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. ఉద్యోగస్తులు వేరే ఉద్యోగాలకు మారతారు.

కన్యా రాశి
వ్యాపారస్తులకు ఆటంకాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే బాధపడాల్సి ఉంటుంది. ఈ సమయం బాగా ఇబ్బందిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

తులరాశి
వ్యాపారం బాగా కలిసివస్తుంది. ఏదైనా పనికి సంబంధించి నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి పనికి ఓపిక ఎంతో ముఖ్యం.

వృశ్చిక రాశి
ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. ఈ సమయంలో ఎంత ఓపికగా ఉంటే అంత లాభాలున్నాయి.

ధనస్సు
ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. వృత్తితోపాటు వ్యాపారంలో కూడా రాణిస్తారు. వీరికి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

మకర రాశి
ఈ రాశివారు ప్రయాణాలు చేస్తారు. ఓర్పు ఎంతో అవసరం. ఏ పనులు చేసినా లాభం వీరికి వస్తుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

కుంభ రాశి
వీరికి ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం పుంజుకోవడంతోపాటు పెట్టుబడుల దిశగా పయనిస్తారు. పనిచేసే విషయంలో సహనం ఎంతో అవసరం.

మీన రాశి
ఈ సమయం వీరికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. ప్రయాణాలు చేస్తారు. ఇవి కూడా లాభసాటిగా మారతాయి. వ్యాపారంలో బాగా కలిసివస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+