రేపు సోమావతి అమావాస్య.. ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
హిందూమతంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల ఏప్రిల్ 8న అమావాస్య సోమవారం వచ్చింది. దీన్ని సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఆరోజు పరమేశ్వరుడిని పూజించడంతోపాటు గంగా స్నానం ఆచరించడంవల్ల వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. అందుకే ఈరోజును ఎంతో ప్రత్యేకమైందిగా పరిగణిస్తారు. సోమావతి అమావాస్యరోజు నదీస్నానం చేస్తే పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. అదృష్టం కలగడంతోపాటు సంతోషం పెరుగుతుంది. ఎనిమిదోతేదీ తెల్లవారుజామున 3.11 గంటలకు ప్రారంభమై రాత్రి 11.50 గంటలకు ముగుస్తుంది.
అదేరోజు మీనరాశిలో సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి బాధలను మిగల్చబోతున్నాయి. కొందరికి మాత్రం అదృష్టాన్ని ఇవ్వనున్నాయి. ఆరోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. చెప్పులు, బూట్లు, అన్నం, గొడుగులు, బట్టలు వంటివి దానం చేయాలి. గోమాతకు ఆహారం పెట్టాలి. ఉపవాసం ఉంటే మంచిది. పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడంతో అదృష్టం కలుగుతుంది. కొన్ని పరిహారాలు పాటించడంవల్ల సంపద రెట్టింపు అవుతుంది. శివుడికి అభిషేకంతోపాటు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేయాలి. రావిచెట్టును పూజించడంవల్ల అనంతమైన ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి
వృత్తిలో విజయం సాధించడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భౌతిక సౌకర్యాలతో జీవితాన్ని గడుపుతారు. ఆదాయం పెరగడంతోపాటు పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
కన్యా రాశి
వివాహం కుదురుతుంది. ధనప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉన్నాయి. ఈ రాశివారికి అన్నీ మంచి ఫలితాలే కలుగుతాయి.
తులా రాశి
వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ధనప్రవాహం ఉంది. ఆర్థికంగా బలపడతారు. వారసత్వంగా ఆస్తి లభించడంతోపాటు రాజకీయాల్లో రాణిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
కుంభ రాశి
కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆధ్యాత్మిక పనుల్లో ఆసక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించడంతోపాటు కెరీర్ లో విజయం సాధిస్తారు. ప్రతి పనిలో సానుకూలమైన మార్పులతో, ఆలోచనలతో ముందుకు పయనిస్తారు.












Click it and Unblock the Notifications