జులై నెల ఈ రాశులకు బాగా కలిసివస్తుంది
జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెల ఏడోతేదీన శుక్రుడు కర్కాటక రాశిలోకి, కుజుడు వచ్చేనెల 12వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తారు. అలాగే జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటకంలోకి, 19వ తేదీన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తారు. ఈ నాలుగు ప్రధాన గ్రహాల సంచారం కొన్ని రాశులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. వృత్తిలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. అన్ని పనుల్లో ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయి.
కన్య రాశి
జులై నెల వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. సూర్యుడు, బుధుడి సంచారం వీరి జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. ప్రేమ సంబంధాల్లో మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవడంతోపాటు ప్రేమ ఎంతో గాఢంగా ఉంటుంది. వృత్తిలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలో చాలా సులువుగా పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాలున్నాయి. వ్యక్తిగత జీవితం ఆనందంగా గడుస్తుంది. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుంటుంది.

ధనుస్సు రాశి
కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. సంపద పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రేరణను పొందుతారు. పనులన్నీ ఆటంకాల్లేకుండా పూర్తవుతాయి. చదువుకు సంబంధించి సౌకర్యాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. బంధువులు, మిత్రుల సహాయంతో ధనలాభం పొందుతారు.
మీన రాశి
అదృష్టం తోడుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రతి పని మంచి ఫలితాన్ని అందిస్తుంది. మనసు ఆనందంగా మారుతుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.












Click it and Unblock the Notifications