తులా రాశిలో శుక్రుడు... ఈ రాశులకు అపార సంపద
వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంపద, కీర్తి, విలాసం, ఐశ్వర్యం, భౌతిక ఆనందానికి కారకుడు. నవంబర్ 30 న శుక్రుడు తన సొంత రాశిలో ప్రవేశించబోతున్నాడు. ప్రధానంగా మూడు రాశులవారికి శుక్రుడి సంచారం వల్ల అదృష్టం ప్రకాశించనుంది. సంపదలో విపరీతమైన పెరుగుదల ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
సంతానం అభివృద్ధి చెందుతారు. ఉద్యోగం లేదంటే వివాహం ఉంటుంది. ప్రేమ సంబంధం ఉన్నవారు అందులో విజయం సాధిస్తారు. వివాహానికి వీరి బంధం దారితీస్తుంది. ప్రణాళికలన్నీ సక్సెస్ అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఊహించని ద్రవ్య లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

కన్య రాశి
శుక్రుడి సంచారం కన్యారాశి నుంచి డబ్బు, వాక్కు స్థానానికి జరగబోతోంది. ఎప్పటికప్పుడు డబ్బును అందుకుంటూనే ఉంటారు. ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది. పనిచేసేచోట కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. శుక్రుడు ఈ రాశి నుంచి తొమ్మిదో ఇంటికి అధిపతి. అదృష్టం బాగుంది. పనిమీద లేదంటే వ్యాపార పనులమీద దూర ప్రయాణం చేస్తారు. ఈ ప్రయాణం కూడా లాభసాటిగా మారుతుంది.
మకర రాశి
పనిచేసే ప్రాంతంతోపాటు వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. కెరీర్ కు సంబంధించిన ప్లాన్స్ అన్నీ విజయవంతమవుతాయి. కెరీర్ కు సంబంధించి మంచి ఆఫర్లను అందుకుంటారు. వ్యాపారంలో కొద్దికాలం నుంచి నిలిచిపోయిన పనులు మళ్లీ మంచి ప్రణాళికతో ప్రారంభమవుతాయి. కోరికలు కూడా నెరవేరతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications