17 నుంచి అదృష్టం పట్టుకుంటుంది
నవంబర్ 16న కుజుడు, నవంబర్ 17న సూర్యుడు వృశ్చికరాశిలోకి సంచారం చేయబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలగనున్నాయి. అయితే జ్యోతిష్య పండితులు అందుకు పరిహారాలు కూడా చెబుతున్నారు. ఏయే రాశులవారి జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం.
మేష రాశి : కోపం ఎక్కువగా ఉండటంవల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా కోపాన్ని తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఆ సమయంలో జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.

వృషభ రాశి : మానసికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీపై మీరు నియంత్రణ కోల్పోతారు. కోపంవల్ల ఇష్టమైనవాటిని వదులుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి మద్దతు దొరుకుతుంది.
మిథున రాశి : మనసు ఆనందమయంగా మారుతుంది. ఎటువంటి పనులైనా సులువుగా పూర్తిచేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగం చేసే ప్రాంతంలో పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం.
కర్కాటక రాశి : పనిచేసే చోట ఎటువంటి పనినైనా సులువుగా చేయగలుగుతారు. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద పనులు కూడా సులువుగా అవుతాయి.
సింహ రాశి : అతిగా ఆలోచించవద్దు. కళలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయి. మానసికంగా సమస్యలు ఎదురవుతాయి. అనేకరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కన్యా రాశి : మనసు కలత పడుతుంది. ఆత్మవిశ్వాసం లోపించడంతో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications