మహాపురుష రాజయోగం.. వీరికి లాటరీ తగులుతుంది
సూర్యుడు ప్రతి నెలా రాశిచక్రాన్ని మారుస్తాడు. నవంబర్ 17న సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు. వాస్తవానికి ఈ రాశిలో కుజుడు ఉన్నాడు. సూర్యుడు ప్రవేశించడంవల్ల సూర్యుడు, అంగారకుడి కలయిక ఏర్పడుతుంది. దీనివల్ల మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఇది మూడు రాశులవారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. సూర్య రాశిలో మార్పువల్ల ఎవరెవరికి లాభాలు కలగనున్నాయో తెలుసుకుందాం.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారికి సూర్య సంచారము చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు ప్రస్తుతం చేతికి అందుతుంది. తద్వారా ఆదాయం పెరుగుతుంది. దీపావళి తర్వాత వీరికి లక్ష్మీదేవి అండగా ఉంటుంది.

కన్యరాశి
కెరీర్ పరంగా మంచి సమయం. ప్రమోషన్ పొందుతారు. ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలున్నాయి. ఆర్థికంగా లాభపడటానికి ఇది మంచి సమయం. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. డబ్బు విషయంలో లాటరీ తగిలే అవకాశం ఉంది.
మీనరాశి
సూర్యుడి సంచారం ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను అందించనుంది. ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పాత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారం చేసే వారికి సూర్యుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఒక పెద్ద ఒప్పందాన్ని నిర్ధారించవచ్చు. విహారయాత్రకు కూడా వెళతారు.












Click it and Unblock the Notifications