కుజుడి సంచారం... వివాదాలతో సహవాసం
జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహం కుజుడు. నవంబర్ 16వ తేదీ ఉదయం 10.04 గంటల నుంచి వృశ్చికరాశిలోకి సంచారం చేయడం ప్రారంభిస్తుంది. డిసెంబర్ 28వ తేదీ వరకు అదే రాశిలో ఉంటుంది. దీని ప్రభావం అన్ని రాశులపై పడుతున్నప్పటికీ కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులవారు ఏవిధంగా ప్రభావితమవుతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి:
సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాల్పి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు, పరిపాలనతో సంబంధం ఉన్నవారికి మంచి ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి:
జీవిత భాగస్వామితో వివాదాలుంటాయి. కుటుంబ సభ్యులకు అనారోగ్యం తలెత్తుతుంది. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మిథున రాశి:
ఇతరులతో పోటీపడి సులభంగా గెలుపొందుతారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. దూకుడుగా వ్యవహరిస్తారు.
కర్కాటక రాశి:
విద్యార్థులకు మేలు కలుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించనిరీతిలో లాభాలుంటాయి. పెండింగ్ లో ఉన్న పనులు కూడా అవుతాయి. ఎంత శ్రమపడితే అంత ప్రయోజనం ఉంటుంది.
సింహ రాశి:
స్థిర, చరాస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. వ్యక్తిగత విషయాల్లో వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కన్యా రాశి:
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులు వృద్ధి చెందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.
తులా రాశి:
పెట్టుబడులు పెట్టి విజయాలు సాధిస్తారు. శుభకార్యాలకు డబ్బులు ఖర్చవుతాయి. కోపంవల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి:
సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త పరిచయాలు, కొత్త సంబంధాలు ఏర్పడతాయి.
మకర రాశి:
వివాదాస్పద విషయాలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. అందరినుంచి సహకారం లభిస్తుంది.












Click it and Unblock the Notifications