ఈ ఒక్క వస్తువు.. మీ ఇంటి వాస్తు దోషాలను తొలగిస్తుంది
మన జీవితంలో అంతర్భాగం వాస్తు. అది సరిగా ఉంటే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపచేస్తుంది. ఒకవేళ వాస్తు దోషాలుంటే మాత్రం వ్యతిరేక శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరు వాస్తు దోషాలున్నాయిన ఇల్లు మారుతుంటారు. అవసరం లేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలు అనుసరిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
ఇంట్లో వాస్తు దోషాలన్నింటినీ తొలగించడానికి చిన్న కర్పూరపు ముద్ద చాలు.
ఇది ఇంట్లోని ప్రతికూలశక్తిని తొలగిస్తుంది.
కర్పూరంతోపాటు మరికొన్ని వస్తువులు కూడా ప్రతికూలశక్తిని పారద్రోలుతాయి.

ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని మీకు అనిపిస్తే వెంటనే కర్పూరాన్ని వేర్వేరు ప్రదేశాల్లో పెట్టాలి.
ఇంట్లో మూలల్లో కర్పూరం ఉంటే చాలా మంచిది.
మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు.
ఇంట్లో డబ్బులుంచే చోట కూడా పెట్టుకోవచ్చు.
సానుకూలశక్తిని ఆకర్షించి, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది.
ఇంట్లో కర్పూరం వెలిగినప్పుడు క్రిమికీటకాలన్నీ చనిపోతాయి.
కర్పూరం వాసన గాలిని శుద్ధం చేస్తుంది.
ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.
కర్పూరం విరిగిపోతే దాని ప్రభావం పోతుంది.
ఇంటి సింహద్వారానికి ఎదురుగా అద్దం ఉండకూడదు.
దీనివల్ల సానుకూల శక్తి లోపలికి రాదు.
అద్దాలు పగిలివుంటే వెంటనే బయట పారేయాలి.
దీనివల్ల దురదృష్టం వెంటాడుతుంది.
కుటుంబ సభ్యుల ఆయుష్షు తగ్గుతుంది.
ఇంట్లో పనిచేయని గడియారాలు, ప్లేట్లు, గాజు వస్తువులు తీసేయాలి.
అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి.
వ్యతిరేక శక్తిని సృష్టిస్తాయి.
ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి.
గాలి, వెలుతురు బాగా రావాలి.
తలుపు దగ్గర అనవసరమైన వస్తువులు ఉంచకూడదు.
ఇంట్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి.












Click it and Unblock the Notifications