ఈరాశి వారికి ప్రథమార్థంలో అదృష్టం కలిసివస్తుంది!

విలాసాల విషయంలోను, కుటుంబ సభ్యుల అవసరాల విషయంలోను మీరు ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తారు.

ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 22 వరకు గురువు మీ రాశికి 5వ స్థానమైన మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత 6వ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు.

మిశ్రమ ఫలితాలుంటాయి

మిశ్రమ ఫలితాలుంటాయి

వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం ఉండటంతో ఆర్థికంగా ఈ సమయం మీకు అనుకూలిస్తుంది. 11, 9, 1వ ఇంటిపై గురు దృష్టి ఉండటంతో పెట్టిన పెట్టుబడులతోపాటు సొంత ఆలోచనలవల్ల లాభాలు ఆర్జిస్తారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగుతాయి. చాలా విషయాల్లో అదృష్టం కలిసివస్తుంది. ప్రథమార్థంలో మీరు డబ్బును సంపాదిస్తారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం, శని దృష్టి 6వ ఇంటిపై ఉండటంతో అవసరం లేకుండా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది.

విలాసాల విషయంలో డబ్బు ఖర్చు

విలాసాల విషయంలో డబ్బు ఖర్చు

విలాసాల విషయంలోను, కుటుంబ సభ్యుల అవసరాల విషయంలోను మీరు ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తారు. గురు దృష్టి 12వ ఇంటిపై ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో డబ్బులు ఖర్చు చేస్తారు. వాహనం లేదంటే ఇల్లు, ఇతర పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది. బ్యాంకు లోను కానీ, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కోసంకానీ ఎదురుచూస్తుంటే ఆ విషయంలో మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను చేకూరుస్తాయి. దీన్ని బట్టి పెట్టుబడుల విషయంలో ఆలోచించి అడుగు వేయడం మంచిది.

6వ ఇంటిలో రాహువు

6వ ఇంటిలో రాహువు


రాహువు 6వ ఇంటిలో ఉండటంతో వివాదాలు, కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం మీకు ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 14 వరకు, జూన్ 15 నుంచి జులై 17 వరకు, అక్టోబరు 18 నుంచి నవంబరు 17 వరకు సూర్యుడి గోచారంవల్ల అనుకూలంగా ఉండదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధ ఒప్పందాలు, కొనుగోళ్ల విషయంలో ఇది అనుకూలించే సమయం కాదు కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో కొనుగోలు చేయకుండా, పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+