సొంత రాశిలోకి శుక్రుడు... ఈ రాశులకు సంపదను మోసుకొస్తున్నాడు!

నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన శుక్రుడు సంపదను ఇస్తాడు. కళలకు, ఫ్యాషన్ రంగాలకు కూడా ఆయనే కారకుడు. ప్రతి నెల రోజులకు ఒకసారి రాశిని మార్చే శుక్రుడు ఈ సారి తన సొంత రాశి అయిన తులారాశిలోకి రాబోతున్నాడు. ఈ రాశిలో ఏడాదికోసారి మాత్రమే ఉంటాడు. దీనివల్ల సెప్టెంబరు నెలలో జాతకాల్లో శుక్రుడు బలంగా ఉన్నవారికి శుభాలు కలగనున్నాయి. అంతేకాకుండా శక్తివంతమైన బుధాదిత్య, మాలవ్య రాజయోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ యోగాల వల్ల కొన్ని రాశులకు విముక్తి కలుగుతుంది. ఏయే రాశులు ఈ పరిణామం వల్ల లాభపడతారో చూద్దాం.

మకర రాశి
ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అవి కూడా లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. పాత పరిచయాల నుంచి లాభాలను భారీగా అందుకుంటారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. వరుస విజయాలను ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు. అదృష్టం తోడుండటంవల్ల ఎటువంటి పనినైనా చాలా సులువుగా పూర్తిచేయగలుగుతారు.

three zodiac signs are very lucky and get huge money due to venus will enter libra in September month

తులా రాశి
సమాజంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఊహించని రీతిలో ప్రయోజనాలను అందుకుంటారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. రెండు వైపులా కుటుంబాల నుంచి ఇబ్బందులు ఎదురుకావు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితాన్ని మెరుగు పరుచుకుంటారు. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది.

కుంభ రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి, ఇప్పుడు పెట్టే పెట్టుబడుల నుంచి భారీ లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక జీవితం గడుపుతారు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. వీరి మాటలు ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు శుక్రుడిని, బుధుడిని పూజిస్తే మేలు కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+