ఈ రాశులను బంగారు బిస్కెట్లతో ఆశీర్వదిస్తున్న శనిదేవుడు

నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం శని. శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఆయన న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి పనులు చేసినవారికి అంతకు రెట్టింపు మంచి ఫలితాలు, చెడు పనులు చేసినవారికి మూడురెట్లు ఎక్కువ చెడు ఫలితాలను కలగజేస్తాడు. నీతికి, నిజాయితీకి శని ప్రతిరూపం. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనిదేవుడికి నువ్వులనూనెతో అభిషేకం చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి.
ప్రస్తుతం పుష్యమాసం నడుస్తోంది. ఈ మాసం అంటే ఆయనకు ఎంతో ప్రీతి. ఈ సమయంలో చేసిన పూజలు రెట్టింపు ఫలితాలనిస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం రోజు సూర్యభగవానుడిని పూజిస్తేఎటువంటి గ్రహ దోషాలు ఉండవు. పుష్యమాసంలో శనిదేవుడు ఏ రాశులకు మంచి ఫలితాలను ప్రసాదిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకుందాం.

మకర రాశి
ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే బాగా రాణిస్తారు. ఒకరకంగా వారి పంట పండినట్లే అని చెప్పొచ్చు. అలాగే భార్య తరఫు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. భూముల కొనుగోలు, అమ్మకాల్లో ఎంతోమంది మీవల్ల లాభపడతారు. దీనివల్ల మీరు భారీ లాభాలను ఆర్జిస్తారు. వచ్చిన డబ్బును పొదుపు చేయడం మంచిది. దుబారా చేస్తే లక్ష్మీదేవి దూరమవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అంటే వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం అనేది మీపై ఆధారపడివుంది.

three zodiac signs leads happy life and will get huge money due to saturn likes pushya masam telugu month

తులా రాశి
ఈ రాశివారు ఉద్యోగంలో ఉంటే వారికి ప్రమోషన్లు ఉన్నాయి. వేతనం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. డబ్బును దుబారా చేస్తారు. వాటిని పొదుపు చేసుకుంటేనే మంచి ఫలితాలను పొందుతారు. దాంపత్య జీవితంలో ఉన్న కలహాలన్నీ విడిపోయి అన్యోన్యంగా జీవిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు సూర్యభగవానుడిని పూజించడంద్వారా ఆర్థికంగా పటిష్టమవుతారు.

మీన రాశి
ఈ రాశివారు శనిదేవుడికి నల్లనువ్వులు, నల్లని వస్త్రంతోపాటు తైలాభిషేకం చేయాలి. దీనివల్ల శనిదేవుడి నుంచి మంచి ఆశీర్వాదం పొందుతారు. ఆయన దయవల్ల మీకు లాటరీ తగిలే అవకాశం ఉంది. వచ్చిన డబ్బును మంచి పనులకు ఉపయోగించడంతోపాటు భవిష్యత్తులో రాబడినిచ్చేలా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఇక రావు అనుకొని వదిలేసిన డబ్బు ఈ సమయంలో తిరిగి మీచేతికి అందుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+