కర్కాటకంలో బుధుడు... ఈ రాశులకు అమోఘమైన ధనయోగం
ఖగోళంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. తెలివితేటలకు, తర్కానికి, జ్ఞానానికి, వ్యాపారానికి కారకుడైన బుధుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే ఆ రాశి చక్రానికి చెందిన వ్యక్తి జాతకం అద్భుతంగా ఉంటుంది. అయితే బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంవల్ల కొన్ని రాశులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మరికొందరికి మాత్రం మిశ్రమ ఫలితాలే అందుతాయి. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
తులా రాశి
కుటుంబంలో వివాదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. శాంతి విలసిల్లుతుంది. పనిచేస్తున్నచోటే ఇతర అవకాశాలు కూడా తలుపుతడతాయి. కష్టపడి పనిచేయడాన్ని వీరు ఇష్టపడతారు. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం కనపడుతోంది. ఓర్పుగా ఉండాలి. వ్యాపారస్తులకు బాగుందికానీ తొందరపడి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు.

మిథున రాశి
ఈ రాశివారు కొత్తగా భూములను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారి జీవితం శృంగారభరితంగా సాగుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. దీంతోపాటు వేతనాలు కూడా పెరుగుతాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక్కట్లు ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని సంతరించుకొని ఉండాలి. అందుకు ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ముఖ్యం.
కర్కాటక రాశి
ఒంటరి జీవితం గడుపుతున్నవారికి వివాహం కుదురుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారి మధ్య అనుబంధం బలపడుతుంది. ఉద్యోగస్థులకు ఈ సమయం బాగా కలిసిరానుంది. అదృష్టం తోడుండటంవల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. బుధుడి రాశి మార్పు వీరికి మంచి సమయాన్ని తెచ్చిందని చెప్పొచ్చు. అన్నిరకాలుగా బాగుంటుంది. అదే సమయంలో కొన్నికొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండురకాలుగా సిద్ధపడివుండాలి.












Click it and Unblock the Notifications