రేపటి నుంచి ఈ రాశులపై సిరుల వర్షం కురిపిస్తున్న విజయదశమి
విజయ దశమి ఈనెల 12వ తేదీన జరుపుకుంటున్నాం. చెడుపై మంచి విజయం సాధించిన రోజు అది. జ్యోతిష్యం ప్రకారం ఆరోజు ఎంతో శుభప్రదమైన రోజు. ఎవరి జాతకంలో అయితే గ్రహాలు శుభస్థానంలో ఉంటాయో వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. రేపు శ్రవణా నక్షత్రం కావడం కూడా కలిసివస్తోంది. విజయ దశమి సందర్భంగా ఏ రాశులవారికి ఏవిధంగా కలిసిరాబోతోంది? ఏవిధంగా ఆర్థిక ప్రయోజనాలుంటాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
కెరీర్ కు సంబంధించి ఓ స్పష్టత వస్తుంది. ఒంటరిగా జీవిస్తున్నవారికి వివాహ ప్రతిపాదనలు అందుతాయి. ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కెరీర్ లో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అవివాహితులకు అతి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. విజయ దశమి సందర్భంగా ఈ రాశులకు అనుకున్నవన్నీ జరుగుతాయి.

వృషభ రాశి
వ్యాపారాలు చేస్తున్నవారికి ఊహించనిరీతిలో లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతోపాటు వేతనం పెరుగుతుంది. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. విజయ దశమి సందర్భంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఊహించని రీతిలో ధనలాభం ఉంది.
తులారాశి
ఒంటరి జీవితం గడుపుతున్నవారికి వివాహ ప్రతిపాదనలు రావడమే కాకుండా పెళ్లిళ్లు కుదురుతాయి. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట సీనియర్ల నుంచి మద్దతు లభించి అద్భుతమైన అదృష్టాన్ని పొందనున్నారు. కష్టాలన్నీ తీరిపోతాయి. దాంపత్య జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి లభించడంతోపాటు కష్టపడి పనిచేసినవారికి అనేక లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications