ఈ నెల 24 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
మనసుకు కారకుడైన చంద్రుడు ఈనెల 24వ తేదీన మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సమయానికి దేవతల గురువైన బృహస్పతి ఆ రాశిలోనే సంచారం చేస్తుంటాడు. దీనివల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. గురువు, చంద్రుడి కలయికతో ఏర్పడుతున్న ఈ యోగం మూడు రాశులవారికి విశేషమైన ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చనుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
తులా రాశి
ఈ రాశివారి ప్రేమ జీవితం చాలా మధురంగా ఉంటుంది. అనేక కంపెనీల నుంచి వీరికి అవకాశాలు వస్తాయి. తల్లికి సంబంధించిన విషయాలపై కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అవసరంలేదు. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల నుంచి తీర్పు వీరికి అనుకూలంగా వస్తుంది. అన్ని విషయాల్లో, అన్ని సమస్యల్లో పరిష్కారం కనుగొంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి వాటిని సంపూర్ణంగా పూర్తిచేస్తారు.

మిథున రాశి
కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా ముందుకు వెళతారు. పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు వస్తాయి. మీలో ఉన్న టాలెంట్ ఈ సమయంలోనే బయటకు వస్తుంది. కార్యాలయంలో మీపై అందరికీ గౌరవం కలుగుతుంది. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. కొత్తగా అవకాశాలు వస్తాయి. వాటిని ఉపయోగించుకుంటారు. అలాగే ప్రయాణాలు కూడా చేస్తారు.
వృషభ రాశి
ఈ రాశివారికి మానసికంగా శాంతి లభిస్తుంది. పెళ్లి కానివారికి పెళ్లయ్యే యోగం ఉంది. అలాగే పెద్దల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలన్నీ సద్దుమణుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తిచేస్తారు. విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ కు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications