బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులకు అఖండ సంపద
నవగ్రహాల్లో కీలకమైన గ్రహం బృహస్పతి. ఆయన దేవతలందరికీ గురువు. గురువు అనుగ్రహం ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. అవసరమైతే ఆయనే దగ్గరుండి ముందుకు నడిపిస్తాడు. వ్యక్తి జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే వారికి తిరుగులేదని చెప్పొచ్చు. బృహస్పతి అంటేనే బంగారానికి, ఇతర ఖనిజాలకు సూచిక. ఆధ్యాత్మికతకు, వివాహానికి, సంతానానికి, జ్ఙానానికి కారకుడు. వ్యక్తి జాతకంలో గురువు అశుభ స్థానంలో ఉంటే పసుపు రంగు దుస్తులు ధరించాలి. గురువుకు ఇష్టమైన రాశులుంటాయి. వారు ఆర్థికంగా అనేక లాభాలను పొందుతారు. బృహస్పతికి ఇష్టమైన రాశుల వివరాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
వీరికి ఊహించనిరీతిలో ధనలాభం ఉంటుంది. సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని కనుగొంటారు. పెద్ద పెద్ద సమస్యలను కూడా చిటెకలో పరిష్కరిస్తారు. అదృష్టం తోడుంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కోరుకున్న పనులన్నీ పూర్తవడంతోపాటు పెండింగ్ పనులు పూర్తిచేయగలుగుతారు. అనారోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరంలేదు.

కర్కాటక రాశి
వివాహాలు కానివారికి వెంటనే వివాహాలు కుదురుతాయి. కోరుకున్నవారితోనే నిశ్చయం అవుతుంది. పెట్టుబడులు పెట్టినవారికి ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు చేతికి అందుతాయి. కొత్త వ్యాపారాలపై పెట్టుబడులు పెడతారు. శుభవార్తలు వింటారు. పిల్లల నుంచి అదృష్టం కలిసివస్తుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సింహరాశి
ఈ రాశివారికి ఎల్లప్పుడూ గురువు అనుగ్రహం లభిస్తుంటుంది. వీరు జీవితకాలం నిజాయితీగా ఉంటారు. అందుకే వీరిని గురువు ఇష్టపడతాడు. ఎటువంటి పనినైనా చాకచక్యంగా పూర్తిచేయగులుగుతారు. భారీ మొత్తంలో సంపాదన కూడబెడతారు. అదృష్టం తోడుండటం, గురువు అనుగ్రహం ఉండటంవల్ల మంచి స్థాయికి చేరుకోవడంతోపాటు పదిమందికి సాయం చేసే స్థితికి చేరుకుంటారు. జీవితం మొత్తం వీరికి శుభప్రదంగా సాగుతుంటుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు గురువును పూజించాలి. నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తుంటే మిగతావన్నీ బృహస్పతి చూసుకుంటారు.












Click it and Unblock the Notifications