నాలుగు గ్రహాల నాలుగు స్తంభాలాట.. ఈ రాశులకు రూ.4 కోట్లు
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవుడు. నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచేవారిపై వరాలజల్లు కురిపిస్తాడు. ఈ నెలలో శనిదేవుడితోపాటు మరో రెండు గ్రహాలు రాశిని మార్చబోతున్నాయి. గ్రహాలకు రాజైన సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా వేరే రాశుల్లోకి ప్రవేశిస్తున్నారు. సూర్యుడు, బుధుడు మీనరాశిలోకి, శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. అప్పటికే అక్కడ శుక్రుడు ఉంటాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ ప్రత్యేకంగా మాత్రం మూడు రాశులపై ఉంటుంది. వారికి అధిక ప్రయోజనాలు దక్కుతాయి. ధనప్రవాహం ఉండటంతోపాటు అనేక లాభాలుంటాయి. వ్యక్తిగతంగా ఈ రాశులవారి జీవితాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం ఇంట్లో చూపించకూడదు. ఇంటికి వచ్చే సమయంలో ఆ ఒత్తిడిని అక్కడే వదిలేయాలి. జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అద్భుతమైన యోగం కలగనుంది. అదృష్టం కలిసిరావడంవల్ల అనేకరకాల ప్రయోజనాలున్నాయి. ఆర్థిక లాభాలున్నాయి. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు స్నేహితుల సహాయం తీసుకోవడంవల్ల తప్పేం ఉండదు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఊహించనిరీతిలో ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలు తలుపు తడతాయి. వాటిని ఉపయోగించుకుంటే కోటీశ్వరులు అవుతారు. ఈ సమయం కూడా మీకు బాగా కలిసివస్తుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి.
మేష రాశి
వృత్తి జీవితంలో వృద్ధి నమోదవుతుంది. అలాగే వ్యక్తిగత జీవితం కూడా మారిపోతుంది. పూర్తిగా అభివృద్ధి చెంది ఆర్థికంగా స్థిరపడతారు. సమాజంలో మీకు హోదా పెరగడంతోపాటు గౌరవం లభిస్తుంది. పదిమందికి సాయం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. సూర్యుడు, బుధుడి నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. వారి నుంచి మంచి ఆశీస్సులు లభిస్తాయి. ఎదుటివారికి డబ్బులిచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తర్వాత ఇబ్బందులు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications