100 ఏళ్ల తర్వాత బృహస్పతి అద్భుతం... ఈ రాశులకు కుబేర యోగం

దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి, వివాహానికి, సంతానానికి, ఆధ్యాత్మికతకు కారకుడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. జాతకంలో గురువు శుభస్థానంలో ఉంటే మరణించేంతవరకు ఆ జీవికి తిరుగులేదని చెప్పొచ్చు. జీవితం అలా సాగుతుంది. బృహస్పతి ఈనెల 12వ తేదీన 18 డిగ్రీల కోణంలో మిథునరాశిలో సంచారం చేయనున్నాడు. దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిణామం చోటుచేసుకోబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి ఆస్తులు విపరీతంగా పెరకబోతున్నాయని, పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు బాగుంటుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కన్యారాశి
ఈ రాశివారికి గురువు విశేషమైన లాభాలను ప్రసాదిస్తున్నాడు. ఆయన దయ వల్ల ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మంచి ఉద్యోగాలు వస్తాయి. దాంపత్య జీవితంలో ఎన్నడూ లేనివిధంగా మంచి ఆనందాన్ని అనుభవిస్తారు. సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు. భౌతికంగా సుఖాలు కలుగుతాయి. శివాలయాల్లో, ఆంజనేయస్వామి ఆలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురువును పూజించడంవల్ల కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి.

three zodiac signs will become millionaires due to Jupiter entered gemini

సింహరాశి
బృహస్పతి దయవల్ల వీరు కూడా సొంతంగా ఇంటిని నిర్మించుకుంటారు. దాంపత్య జీవితం ఎన్నడూ లేనంత సంతోషంగా సాగుతుంది. విశేషమైన ప్రయోజనాలు వీరికి సిద్ధించనున్నాయి. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు భారీగా డబ్బును పొందుతారు. డబ్బులు సంపాదించాలనే తపన ఉన్నవారికి ఈ సమయంలో ఎన్నో అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే కుబేరులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంలో పెద్దలంతా సంతోషంగా ఉంటారు.

మిథునరాశి
పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. వివాహమైనవారికి సంతానం కలుగుతుంది. వీరి జీవితం మొత్తం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు హోదా కలుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తులు, డబ్బు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వచ్చిన డబ్బును పొదుపు చేసుకునే బాధ్యత వీరిపైనే ఉంటుంది. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+