కేతువు వల్ల ధనవంతులు కాబోతున్న రాశులు వీరే

నవగ్రహాల్లో కీలక గ్రహమైన కేతువు నీడ గ్రహం. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు 18 నెలల సమయం తీసుకుంటుంది. జాతకంలో కేతువు శుభ స్థానంలో ఉంటే అంతులేని సిరి సంపదలు కలుగుతాయి. ఖరీదైన వస్తువులకు, విలాసాలకు, ఆధ్యాత్మికతకు కేతువు కారణం. అందుకే కేతువు అంటే భయపడకుండా జాతకంలో శుభస్థానంలో ఉందో లేదో చూసుకుంటే ఆ జాతకానికి తిరుగుండదు. కేతువుకు ఇష్టమైన రాశులుంటాయి. వాటి వివరాలను, వాటికి కేతువు వల్ల కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అద్భుతమైన లాభాలను పొందుతారు. ఇప్పటివరకు ఇబ్బందుల్లో ఉండి పేదరికాన్ని అనుభవిస్తున్నవారి జీవితం మారిపోనుంది. వారు ధనవంతులు అవుతారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా కేతువు బయట పడేస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని తలపెట్టినా లాభాలు భారీగా వస్తాయి. కొత్తగా కారును కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడతారు.

three zodiac signs will become millionaires due to ketu planet

మేష రాశి
వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పనినైనా సులువుగా పూర్తిచేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక జీవితంవైపు మొగ్గుచూపుతారు. దానివల్ల విశేష ప్రయోజనాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.

వృశ్చిక రాశి
ఆర్థికంగా ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అన్నిరకాల పనులు చేయగలుగుతారు. దీనివల్ల మీకున్న అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికే అధిక సమయాన్ని కేటాయిస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కేతువును పూజించడంవల్ల అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+